Poonam Kaur: త్రివిక్రమ్ శ్రీనివాస్ పై తీవ్ర వ్యాఖ్యలు చేసిన పూనం కౌర్

Actress Poonam Kaur comments on Trivikram Srinivas

  • త్రివిక్రమ్ చెడు స్వభావం తనకు తెలుసన్న పూనం
  • జీవితాలను నాశనం చేసే స్వభావం కలవాడని వ్యాఖ్య
  • ఆయనతో తనకున్న అనుభవం సరైంది కాదన్న పూనం

ప్రముఖ సినీ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ పై సినీ నటి పూనం కౌర్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. 'జల్సా' సినిమాలో రేప్ కామెంట్స్ ను ఉద్దేశించి సోషల్ మీడియాలో ఆమె స్పందిస్తూ... త్రివిక్రమ్ నుంచి ఇంతకు మించి మంచి కంటెంట్ ను ఆశించలేమని అన్నారు. ఈ వ్యాఖ్యలపై ఓ నెటిజన్ స్పందిస్తూ... త్రివిక్రమ్ మీద మీకున్న ద్వేషాన్ని సోషల్ మీడియాలో వెల్లడిస్తున్నారని విమర్శించాడు. ఈ వ్యాఖ్యలకు పూనం కౌంటర్ ఇచ్చారు. 

త్రివిక్రమ్ ఎలాంటివాడో, ఎలాంటి చెడు స్వభావం ఉన్నవాడో తనకు తెలుసని పూనం అన్నారు. ఆయనతో నీకున్న అనుభవం మంచిది అయిండొచ్చని... కానీ, తనకు ఉన్న అనుభవం మాత్రం సరైంది కాదని చెప్పారు. జీవితాలను నాశనం చేసే స్వభావం ఉన్నవాడు త్రివిక్రమ్ అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఒకసారి త్రివిక్రమ్ దగ్గరకు వెళ్లి తనకు ఆయన ఏం చేశాడో, వేరే వాళ్ల చేత ఏం చేయించాడో ఆయన్నే అడగండని చెప్పారు. పూనం చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Poonam Kaur
Trivikram Srinivas
Tollywood
  • Loading...

More Telugu News