Kumaraswamy: విశాఖ స్టీల్ ప్లాంట్ గురించి ఎవరూ ఆందోళన చెందొద్దు: కుమారస్వామి

Dont worry about Vizag Steel Plant says Kumaraswamy

  • వైజాగ్ పర్యటనకు వచ్చిన కేంద్ర ఉక్కు మంత్రి కుమారస్వామి
  • స్టీల్ ప్లాంట్ లోని విభాగాలను పరిశీలించిన కేంద్ర మంత్రి
  • ప్లాంట్ లో వంద శాతం సామర్థ్యంతో ఉత్పత్తి జరుగుతుందని భరోసా

విశాఖ స్టీల్ ప్లాంట్ ను రక్షించడం తమ బాధ్యత అని కేంద్ర పరిశ్రమలు, ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామి అన్నారు. వైజాగ్ పర్యటనకు వచ్చిన కేంద్ర మంత్రి కాసేపటి క్రితం స్టీల్ ప్లాంట్ ను సందర్శించారు. ప్లాంట్ లోని వివిధ విభాగాలను పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ... విశాఖ స్టీల్ ప్లాంట్ పై ఆధారపడి ఎన్నో కుటుంబాలు బతుకుతున్నాయని చెప్పారు. ప్లాంట్ మూతపడుతుందని ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపారు. ప్రధాని మోదీ ఆశీస్సులతో ప్లాంట్ లో వంద శాతం సామర్థ్యంతో ఉత్పత్తి జరుగుతుందని భరోసా ఇచ్చారు. మరోవైపు స్టీల్ ప్లాంట్ లో కుమారస్వామిని బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు కలిశారు.

Kumaraswamy
Vizag Steel Plant
  • Loading...

More Telugu News