Hardik Pandya: శ్రీలంకతో టీ20 సిరీస్ కు టీమిండియా కెప్టెన్ ఇతడేనా...?

Hardik Pandya reportedly will lead Team India in Sri Lanka tour

  • ఈ నెలాఖరులో శ్రీలంక పర్యటనకు వెళ్లనున్న టీమిండియా
  • టీమిండియా, శ్రీలంక మధ్య 3 టీ20లు, 3 వన్డేలు 
  • టీ20 సిరీస్ కు కెప్టెన్ గా హార్దిక్ పాండ్యా అంటూ ప్రచారం

టీమిండియా ఈ నెలాఖరులో శ్రీలంక పర్యటనకు వెళ్లనుంది. ఈ పర్యటనలో టీమిండియా 3 టీ20 మ్యాచ్ లు, 3 వన్డే మ్యాచ్ లు ఆడనుంది. టీమిండియా కొత్త కోచ్ గా గౌతమ్ గంభీర్ ప్రస్థానం శ్రీలంక పర్యటనతోనే మొదలు కానుంది. 

కాగా, సీనియర్ ప్లేయర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించిన  నేపథ్యంలో... భవిష్యత్ ను దృష్టిలో ఉంచుకుని టీ20 సిరీస్ కు హార్దిక్ పాండ్యా కెప్టెన్ గా వ్యవహరించే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. ఈ మేరకు బీసీసీఐ పెద్దలు నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది. 

శ్రీలంకతో టీమిండియా జులై 27 నుంచి 30 వరకు 3 టీ20లు... ఆగస్టు 2 నుంచి 7 వరకు 3 వన్డేలు ఆడనుంది. 

ఇక శ్రీలంకతో వన్డే సిరీస్ లో కేఎల్ రాహుల్ పునరాగమనం చేయడం ఖాయమని తెలుస్తోంది. కేఎల్ రాహుల్ ఇటీవల జరిగిన టీ20 వరల్డ్ కప్ కు టీమిండియాలో స్థానం దక్కించుకోలేకపోయాడు. టీ20 ఫార్మాట్లో టీమిండియా బెర్తుల కోసం యువ ఆటగాళ్లు పోటీ పడుతుండడంతో, కేఎల్ రాహుల్ కు ఆ ఫార్మాట్లో స్థానం కష్టమే.

More Telugu News