Bharateeyudu 2: సెన్సార్ పనులు పూర్తి చేసుకున్న కమల్ హాసన్ 'భారతీయుడు-2'

Bharateeyudu 2 completes censor works

  • కమల్ హాసన్ ప్రధాన పాత్రలో భారతీయుడు-2
  • శంకర్ దర్శకత్వంలో చిత్రం
  • జులై 12న వరల్డ్ వైడ్ గ్రాండ్ గా రిలీజ్
  • భారతీయుడు చిత్రానికి U/A సర్టిఫికెట్

యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్, స్టార్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్ లో వస్తున్న భారతీయుడు-2 చిత్రం తాజాగా సెన్సార్ పనులు పూర్తి చేసుకుంది. ఈ చిత్రానికి సెన్సార్ బోర్డు U/A సర్టిఫికెట్ మంజూరు చేసింది. భారతీయుడు-2 మూవీ రన్ టైమ్ 180.04 నిమిషాలు. 

లైకా ప్రాడక్షన్స్, రెడ్ జెయింట్ మూవీస్ బ్యానర్లపై తెరకెక్కిన ఈ చిత్రం జులై 12న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఇటీవలే హైదరాబాదులో గ్రాండ్ గా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ప్రమోషన్ ఈవెంట్లు కూడా ముమ్మరంగా నిర్వహించారు. 

ఈ చిత్రంలో కమల్ హాసన్, సిద్ధార్థ్, రకుల్ ప్రీత్ సింగ్, కాజల్ అగర్వాల్, ఎస్ జె సూర్య, బాబీ సింహా, ప్రియా భవానీ శంకర్, సముద్రఖని, బ్రహ్మానందం తదితరులు నటించారు. భారతీయుడు-2 చిత్రానికి అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించాడు.

  • Loading...

More Telugu News