Chandrababu: బీపీసీఎల్ ప్రతినిధులతో భేటీపై సీఎం చంద్రబాబు ట్వీట్

Chandrababu tweets on meeting with BPCL delegation

  • సీఎండీ కృష్ణకుమార్ నేతృత్వంలో రాష్ట్రానికి వచ్చిన బీపీసీఎల్ బృందం
  • అమరావతిలో సీఎం చంద్రబాబుతో భేటీ
  • చమురు పరిశ్రమ కోసం అన్ని సౌకర్యాలు కల్పిస్తామన్న చంద్రబాబు 

భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (బీపీసీఎల్) ప్రతినిధులతో సమావేశం అనంతరం ఏపీ సీఎం చంద్రబాబు సోషల్ మీడియాలో స్పందించారు. దేశంలోని తూర్పు తీరంలో వ్యూహాత్మక స్థానంలో ఉన్న మన రాష్ట్రం గణనీయమైన పెట్రో కెమికల్ సామర్థ్యాలను కలిగి ఉందని తెలిపారు. 

ఇవాళ బీపీసీఎల్ చైర్మన్, మేనేజింగ్  డైరెక్టర్ కృష్ణకుమార్ నాయకత్వంలోని ప్రతినిధుల బృందంతో సమావేశమయ్యానని పేర్కొన్నారు. రాష్ట్రంలో రూ.60 వేల కోట్ల నుంచి రూ.70 వేల కోట్లతో చమురు శుద్ధి కర్మాగారం, పెట్రో కెమికల్ కాంప్లెక్స్ ఏర్పాటు చేయడంపై చర్చించామని చంద్రబాబు తెలిపారు. దీనిపై 90 రోజుల్లో వివరణాత్మక నివేదికను, సాధ్యాసాధ్యాలపై నివేదికను అందించాలని కోరానని వెల్లడించారు. 

ఈ ప్రాజెక్టు కోసం దాదాపు 5 వేల ఎకరాల భూమి అవసరమవుతుందని, ఎలాంటి ఇబ్బందులు లేని రీతిలో ప్రభుత్వం పరిశ్రమ స్థాపనకు అవసరమైన సదుపాయాలు కల్పించేందుకు సిద్ధంగా ఉందని చంద్రబాబు తన ట్వీట్ లో స్పష్టం చేశారు. 

  • Loading...

More Telugu News