Team India: జింబాబ్వేకి 183 పరుగుల టార్గెట్ సెట్ చేసిన టీమిండియా
- టీమిండియా, జింబాబ్వే జట్ల మధ్య మూడో టీ20
- టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియా
- నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లకు 182 పరుగుల నమోదు
- అర్ధసెంచరీతో అలరించిన కెప్టెన్ శుభ్ మాన్ గిల్
- రాణించిన రుతురాజ్ గైక్వాడ్, జైస్వాల్
జింబాబ్వేతో మూడో టీ20 మ్యాచ్ లో టీమిండియా భారీ స్కోరు సాధించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లకు 182 పరుగులు చేసింది. టాపార్డర్ లో ఒక్క అభిషేక్ శర్మ తప్ప మిగతా అందరూ దూకుడుగా ఆడారు. అభిషేక్ శర్మ కేవలం 10 పరుగులకే అవుటయ్యాడు. కెప్టెన్ శుభ్ మాన్ గిల్ 66 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచాడు.
మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియాకు శుభారంభం లభించింది. ఓపెనర్లు యశస్వి జైస్వాల్, శుభ్ మాన్ గిల్ తొలి వికెట్ కు 8, 1 ఓవర్లలోనే 67 పరుగులు జోడించారు. జైస్వాల్ 27 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సులతో 36 పరుగులు చేయగా... గిల్ 49 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్సులతో 66 పరుగులు సాధించాడు. రుతురాజ్ గైక్వాడ్ 28 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్సులతో 49 పరుగులు నమోదు చేశాడు.
ఆఖర్లో సంజూ శాంసన్ 12, రింకూ సింగ్ 1 పరుగుతో నాటౌట్ గా నిలిచారు. జింబాబ్వే బౌలర్లలో బ్లెస్సింగ్ ముజరబాని 2, కెప్టెన్ సికిందర్ రజా 2 వికెట్లు తీశారు.