Anveshana: 'అన్వేషణ'లో భానుప్రియకి ఇంపార్టెన్స్ పెరిగిపోతుందనేది హీరో ఫీలింగ్: వంశీ

Vamsi Interview

  • 1985లో వచ్చిన 'అన్వేషణ'
  • తలకోన ఫారెస్టు నేపథ్యంలో నడిచే కథ 
  • అప్పట్లో ఆ సినిమా సూపర్ హిట్ 
  • ఆ జ్ఞాపకాలను పంచుకున్న వంశీ 
  • కొంత షూట్ చెన్నెలోనే చేశామని వెల్లడి 


వంశీ అంటే ఒక ట్రెండ్ .. వంశీ అంటే ఒక మార్క్ .. వంశీ అంటే సంథింగ్ స్పెషల్ అంతే. ఆయన కథలు ఎంత గొప్పగా ఉంటాయో .. పాటలు అంత కమ్మగా ఉంటాయి. అలాంటి వంశీ సినిమాలలో  'అన్వేషణ' మరింత ప్రత్యేకతను సంతరించుకుని కనిపిస్తుంది. కార్తీక్ - భానుప్రియ జంటగా రూపొందిన ఈ సినిమా, 1985లో విడుదలై ఘనవిజయాన్ని సొంతం చేసుకుంది.  అలాంటి ఈ సినిమాను గురించి ఆయన ఒక వీడియో చేశారు.

తలకోన ఫారెస్టులో 'అన్వేషణ' కొంతవరకూ షూట్ చేసిన తరువాత, ఒక రోజున నిర్మాత కామినేని ప్రసాద్ రావుగారు నా దగ్గరికి వచ్చారు. "కార్తీక్ డేట్లు దొరకడంలేదండీ .. అతనికి ఒక ఇది పట్టుకుంది .. తనకంటే భానుప్రియ పాత్రకి ఇంపార్టెన్స్ పెరిగిపోతుందనే ఫీలింగులో పడిపోయినట్టుగా కనిపిస్తున్నాడు. డేట్లు చూసే మేకప్ మెన్ పద్మనాభన్ ఈ సౌండ్ వచ్చేలా మాట్లాడుతున్నాడు. రెండు మూడు రోజులు తప్ప ఇవ్వలేమని అంటున్నారు" అని అన్నారు.

"పోన్లే అలాగే ఇవ్వమనండి .. సర్దుకుందాం' అని నేనంటే, 'మరి అంత తక్కువ సమయంలో తలకోనలో ఎలా చేస్తామని ఆయన అన్నారు. కెమెరా మెన్ రఘు నేను .. కలిసి 'తలకోన' ఫారెస్టుకి మ్యాచింగ్ లొకేషన్స్ పట్టుకుంటాం అని చెప్పాను. చెన్నైలో అలాంటి లొకేషన్స్ కోసం వెతికాము. చివరికి సిటీ శివారులోని ఒక ఫ్యాక్టరీకి పక్కనే ఉన్న మామిడి తోటని ఎంపిక చేసుకుని, తలకోన ఫారెస్టు అనిపించేలా అక్కడ రెండు పాటలను చిత్రీకరించాము" అని అన్నారు.  

  • Loading...

More Telugu News