Team India: జింబాబ్వేతో మూడో టీ20... టాస్ గెలిచిన టీమిండియా

Team India won the toss against Zimbabwe in 3rd T20

  • జింబాబ్వేలో పర్యటిస్తున్న టీమిండియా
  • ఐదు మ్యాచ్ ల టీ20 సిరీస్ లో నేడు మూడో మ్యాచ్
  • టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియా

టీమిండియా, జింబాబ్వే జట్ల మధ్య నేడు మూడో 20 మ్యాచ్ జరగనుంది. టాస్ గెలిచిన టీమిండియా బ్యాటింగ్ ఎంచుకుంది. ఐదు మ్యాచ్ ల టీ20 సిరీస్ కోసం టీమిండియా యువ జట్టు ప్రస్తుతం జింబాబ్వేలో పర్యటిస్తోంది. సిరీస్ లోని తొలి మ్యాచ్ లో ఆతిథ్య జింబాబ్వే విజయం సాధించగా, రెండో మ్యాచ్ ను టీమిండియా కైవసం చేసుకుంది. 

వరల్డ్ కప్ ఆడిన జట్టులోని సభ్యులైన సంజు శాంసన్, యశస్వి జైస్వాల్, శివమ్ దూబే నేడు జింబాబ్వేతో మూడో టీ20 సందర్భంగా తుది జట్టులోకి వచ్చారు. అటు, జింబాబ్వే జట్టులో రెండు మార్పులు జరిగాయి. ఇన్నోసెంట్ కయా స్థానంలో తదివనాషే మరుమని... ల్యూక్ జోంగ్వే స్థానంలో రిచర్డ్ ఎంగరావా జట్టులోకి వచ్చారు.

More Telugu News