Tirumala: తిరుమల కొండపై భక్తుల రద్దీ సాధారణం

Tirumala update

  • టోకెన్లు లేకుండా వచ్చిన భక్తులకు 8 గంటల్లో దర్శనం పూర్తి
  • నిండిపోయిన వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని అన్ని కంపార్ట్ మెంట్లు
  • నిన్న ఒక్కరోజే స్వామివారికి హుండీ ద్వారా రూ.4.51 కోట్ల ఆదాయం

ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రం తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. తిరుమలలో టోకెన్లు లేకుండా క్యూలైన్లలోకి వచ్చిన భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 8 గంటల సమయం పడుతోంది. సర్వదర్శనం కోసం వచ్చిన భక్తులతో వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని అన్ని కంపార్ట్ మెంట్లు నిండిపోయాయి. నిన్న స్వామివారిని 67,245 మంది భక్తులు దర్శించుకున్నారు. 25,054 మంది భక్తులు తలనీలాల మొక్కులు సమర్పించుకున్నారు. నిన్న ఒక్కరోజే శ్రీవారికి హుండీ ద్వారా రూ.4.51 కోట్ల ఆదాయం లభించింది.

Tirumala
Devotees
Pilgrims
TTD
  • Loading...

More Telugu News