Sidda Reddy: కదిరి మాజీ ఎమ్మెల్యే సిద్ధారెడ్డిని సస్పెండ్ చేసిన వైసీపీ అధినేత జగన్

YCP suspends Kadiri ex mla Sidda Reddy

  • గత ఎన్నికల్లో సిద్ధారెడ్డికి టికెట్ దక్కని వైనం
  • పార్టీకి వ్యతిరేకంగా పనిచేసినట్టు ఫిర్యాదులు
  • నిజమేనని తేల్చిన వైసీపీ క్రమశిక్షణ కమిటీ

శ్రీ సత్యసాయి జిల్లా కదిరి నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే డాక్టర్ పీవీ సిద్ధారెడ్డిపై వైసీపీ నాయకత్వం సస్పెన్షన్ వేటు వేసింది. ఇటీవలి ఎన్నికల్లో  సిద్ధారెడ్డి పార్టీకి వ్యతిరేకంగా పనిచేసినట్టు గుర్తించారు. దాంతో సిద్ధారెడ్డిని పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ వైసీపీ అధినేత జగన్ నిర్ణయం తీసుకున్నారు. 

2024 అసెంబ్లీ ఎన్నికల్లో సిద్ధారెడ్డికి వైసీపీ హైకమాండ్ టికెట్ నిరాకరించింది. కదిరి టికెట్ ను మైనారిటీ నేత మక్బూల్ అహ్మద్ కు కేటాయించింది. మక్బూల్ అహ్మద్ టీడీపీ అభ్యర్థి కందికుంట వెంకటప్రసాద్ చేతిలో ఓటమిపాలయ్యారు.

అయితే, సిద్ధారెడ్డి... మక్బూల్ అహ్మద్ కు వ్యతిరేకంగా పనిచేశారంటూ వైసీపీ నాయకత్వానికి ఫిర్యాదులు అందాయి. ఈ ఫిర్యాదులను పరిశీలించిన వైసీపీ క్రమశిక్షణ కమిటీ... అవి నిజమేనని తేల్చి, పార్టీ అధ్యక్షుడు జగన్ కు సిఫారసు చేసింది. ఈ క్రమంలోనే సిద్ధారెడ్డిపై వేటు పడింది.

  • Loading...

More Telugu News