Raghu Rama Krishna Raju: రఘురామకృష్ణరాజుకు ఫస్ట్ ర్యాంక్... ఎందులో అంటే...!

Raghu Rama Krishna Raju gets first rank but why

  • గతంలో ఎంపీగా ఉన్న రఘురామకృష్ణరాజు
  • 17వ లోక్ సభలో ఏపీ ఎంపీల పనితీరుపై ఓ సంస్థ సర్వే
  • 143.7 స్కోరుతో రఘురామ టాప్
  • చివరి స్థానంలో నందిగం సురేశ్

ఉండి నియోజకవర్గం ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు గతంలో ఎంపీ అన్న సంగతి తెలిసిందే. 2019లో వైసీపీ తరఫున నరసాపురంగా లోక్ సభ స్థానం నుంచి గెలిచిన రఘురామకృష్ణరాజు... ఇటీవలి ఎన్నికలకు ముందు టీడీపీలో చేరి ఉండి అసెంబ్లీ స్థానం నుంచి గెలిచారు. 

కాగా, 17వ లోక్ సభలో ఏపీ ఎంపీల పనితీరుపై పాలిటిక్స్ ఫర్ ఇంపాక్ట్ సంస్థ నిర్వహించిన సర్వేలో రఘురామకృష్ణరాజుకు ఫస్ట్ ర్యాంక్ లభించింది. లోక్ సభకు ఎంపీల హాజరు, వారు లేవనెత్తిన ప్రశ్నల ఆధారంగా పాలిటిక్స్ ఫర్ ఇంపాక్ట్ సంస్థ సర్వే నిర్వహించింది. ఇందులో రఘురామకృష్ణరాజు 14.3.7 స్కోరుతో నెంబర్ వన్ స్థానంలో నిలిచారు. 

రెండో స్థానంలో గల్లా జయదేవ్, మూడో స్థానంలో వంగా గీత (వైసీపీ) ఉన్నారు. ప్రస్తుతం కేంద్రమంత్రిగా ఉన్న కింజరాపు రామ్మోహన్ నాయుడు 4వ ర్యాంకు దక్కించుకున్నారు. చిట్టచివరి స్థానంలో నందిగం సురేశ్ (వైసీపీ) నిలిచారు.

More Telugu News