Surendra: ఘంటసాల అల్లుడు ఓ పాప్యులర్ చైల్డ్ ఆర్టిస్ట్ అని తెలుసా?

Ghnatasala Son in Law Interview

  • కెమెరా ముందుకు వచ్చిన ఘంటసాల అల్లుడు 
  • బాలనటుడిగా చేసిన సినిమాలు 50కి పైగా
  • నటన పట్ల ఆసక్తి లేదని చెప్పిన సురేంద్ర 
  • చెన్నెలోని శ్రీమంతులలో ఆయన ఒకరు    

మహా గాయకుడు ఘంటసాల .. ఆయన ఫ్యామిలీ గురించి తెలుసుకోవాలనే ఆసక్తి చాలామందిలో ఉంటుంది. ఘంటసాల చనిపోయే సమయానికి ఆయన కూతురు శాంతి వయసు 11 సంవత్సరాలు. ఆ తరువాత ఆమె వివాహం సురేంద్రతో జరిగింది. ఆయన చెన్నైలో పెద్ద బిజినెస్ మేన్ .. అక్కడి శ్రీమంతులలో ఒకరు. అలాంటి ఆయన తాజాగా సుమన్ టీవీ ఇంటర్వ్యూ ద్వారా కెమెరా ముందుకు వచ్చారు.  

సురేంద్ర పాప్యులర్ చైల్డ్ ఆర్టిస్ట్. ఎన్టీఆర్ .. ఏఎన్నార్ .. శోభన్ బాబు .. కృష్ణ సినిమాలలో ఆయన నటించారు. 'బాలమిత్రుల కథ' సినిమాలో 'గున్నమామిడి కొమ్మమీద' పాట ఆయనపై చిత్రీకరించినదే. ఆ పాటలో ముద్దుగా బొద్దుగా అమాయకంగా కనిపించే ఆ కుర్రాడే ఈ సురేంద్ర. ఘంటసాల చనిపోయే సమయానికి ఆయన వయసు 13.

"మొదటి నుంచి కూడా నాకు సినిమాలలో నటించడమంటే ఇష్టం వుండేది కాదు. మా అమ్మగారి కోసం నటించాను. నేను హీరోను కావాలని మా అమ్మగారికి ఉండేది .. కానీ నాకు ఆ వైపు ఎక్కువ ఆసక్తి ఉండేది కాదు. అంతకుముందు ఘంటసాల గారి కుటుంబంతో మాకు చుట్టరికం లేదు. ఆ తరువాత కాలంలో ఘంటసాల గారి అమ్మాయి .. నేను ప్రేమించుకుని పెళ్లి చేసుకున్నాము" అని చెప్పారు.

Surendra
Ghantasala Shanthi
Chennai
  • Loading...

More Telugu News