AP Cabinet: ఈ నెల 16న ఏపీ క్యాబినెట్ సమావేశం

AP Cabinet will meet on July 16

  • రాష్ట్ర సచివాలయం వేదికగా మంత్రివర్గ భేటీ
  • ఓటాన్ అకౌంట్ ఆర్డినెన్స్ కు ఆమోదంపై చర్చ
  • ఎన్నికల హామీలు, రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపైనా చర్చించే అవకాశం

ఏపీలో కూటమి ప్రభుత్వ క్యాబినెట్ ఈ నెల 16న సమావేశం కానుంది. వెలగపూడిలోని రాష్ట్ర సచివాలయంలో ఈ క్యాబినెట్ భేటీ జరగనుంది. ఈ నెల 22 నుంచి ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరగనున్న నేపథ్యంలో, ఈ నెల 16న జరిగే క్యాబినెట్ భేటీలో ఓటాన్ అకౌంట్ ఆర్డినెన్స్ కు ఆమోదంపై చర్చించనున్నారు. ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీల మేరకు ప్రభుత్వం అమలు చేయాల్సిన పథకాలపైనా, రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపైనా ఈ సమావేశంలో చర్చించే అవకాశం ఉంది. 

గత వైసీపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఓటాన్ అకౌంట్ బడ్జెట్ జులై 31 వరకు ఉంటుంది. దాంతో, ప్రస్తుతానికి తాత్కాలిక బడ్జెట్ కోసం కూటమి ప్రభుత్వం ఆర్డినెన్స్ తీసుకురానుంది. సెప్టెంబరులో పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశాలున్నాయి.

AP Cabinet
Chandrababu
TDP-JanaSena-BJP Alliance
Andhra Pradesh
  • Loading...

More Telugu News