Team India: జింబాబ్వేలో వైల్డ్ లైఫ్ టూర్ తో సేదదీరిన టీమిండియా ఆటగాళ్లు
![Team India players and their families enjoyed wild life in Zimbabwe](https://imgd.ap7am.com/thumbnail/cr-20240709tn668d031cda0be.jpg)
ఐదు టీ20 మ్యాచ్ ల సిరీస్ కోసం జింబాబ్వేలో పర్యటిస్తున్న టీమిండియా ఆటగాళ్లు, వారి కుటుంబ సభ్యులు ఆట విడుపు కోసం స్థానిక అభయారణ్యాలను సందర్శించారు. ఈ సిరీస్ లో ఇప్పటికే రెండు మ్యాచ్ లు జరిగాయి. మూడో మ్యాచ్ ఈ నెల 10న జరగనుంది. ఈ మధ్యలో విరామం రావడంతో... టీమిండియా ఆటగాళ్లు, వారి కుటుంబ సభ్యుల కోసం బీసీసీఐ... జింబాబ్వే క్రికెట్ బోర్డు, జింబాబ్వే టూరిజం శాఖతో కలిసి ఈ వైల్డ్ లైఫ్ టూర్ ఏర్పాటు చేసింది. దీనికి సంబంధించిన ఫొటోలను బీసీసీఐ సోషల్ మీడియాలో పంచుకుంది.
![](https://img.ap7am.com/froala-uploads/20240709fr668d02441c132.jpg)
![](https://img.ap7am.com/froala-uploads/20240709fr668d024ec66b7.jpg)
![](https://img.ap7am.com/froala-uploads/20240709fr668d025ced729.jpg)
![](https://img.ap7am.com/froala-uploads/20240709fr668d0267444a6.jpg)