Neha Sharma: మిస్టరీ థ్రిల్లర్ గా '36 డేస్' .. నేహా శర్మ బోల్డ్ వెబ్ సిరీస్!

36 Days WebSeries Update

  • నేహాశర్మ ప్రధాన పాత్రగా '36 డేస్'
  • మిస్టరీ థ్రిల్లర్ జోనర్లో నడిచే కథ
  • 8 ఎపిసోడ్స్ గా పలకరించే సిరీస్ 
  • ఈ నెల 12 నుంచి సోనీ లివ్ లో  స్ట్రీమింగ్
  • వివిధ భాషల్లో అందుబాటులోకి వస్తున్న కంటెంట్  


ఈ మధ్య కాలంలో థ్రిల్లర్ నేపథ్యంలో వచ్చే వెబ్ సిరీస్ కి విపరీతమైన ఆదరణ లభిస్తోంది. ఈ తరహా కథలకి కాస్త బోల్డ్ టచ్ ఉంటే ఇక ఆ వెబ్ సిరీస్ లకు ఒక రేంజ్ లో రెస్పాన్స్ వస్తోంది. ఈ నేపథ్యంలోనే సోనీ లివ్  ఫ్లాట్ ఫామ్ ద్వారా ఆడియన్స్ ను పలకరించడానికి ఓ మిస్టరీ థ్రిల్లర్ సిద్ధంగా ఉంది .. దాని పేరే '36 డేస్'. 

'36 డేస్' అనే టైటిల్ చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తోంది. ఇక ఈ టైటిల్ కి సీక్రెట్స్ ఆర్ ఇంజూరియస్ టు హెల్త్' అనే ట్యాగ్ లైన్ మరింత ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఈ నెల 12వ తేదీ నుంచి ఈ సిరీస్ స్ట్రీమింగ్ కానుంది. నేహా శర్మ ప్రధానమైన పాత్రలో నటించగా, ఇతర ముఖ్యమైన పాత్రలలో పూరబ్ కోహ్లీ .. శ్రుతి సేఠ్ .. చందన్ రాయ్ .. షరీబ్ హష్మీ .. అమృత ఖాస్విల్కర్ కనిపించనున్నారు.

 విశాల్ ఫ్యూరియా దర్శకత్వం వహించిన ఈ సిరీస్ 8 ఎపిసోడ్స్ గా రానుంది. రీసెంటుగా వదిలిన టీజర్ కి అనూహ్యమైన రెస్పాన్స్ వచ్చింది. ఇది మిస్టరీ థిల్లర్ జోనర్ కి చెందిన కంటెంట్ కావడం .. ఇది బోల్డ్ కంటెంట్ అనే విషయాన్ని టీజర్ స్పష్టం చేయడం వలన, యూత్ ఈ సిరీస్ కోసం వెయిట్ చేస్తోంది. ఈ సిరీస్ ఏ స్థాయిలో వారికి కనెక్ట్ అవుతుందనేది చూడాలి మరి.

More Telugu News