Mujra Party: మొయినాబాద్ ఫాంహౌస్ లో ముజ్రా పార్టీ

Rajendranagar SOT Police Raid On Moinabad FarmHouse

-


రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ లోని ఓ ఫాంహౌస్ లో సోమవారం అర్ధరాత్రి ముజ్రా పార్టీ జరిగింది. ఢిల్లీ నుంచి యువతులను తీసుకొచ్చి మరీ పార్టీ ఏర్పాటు చేశారు. పార్టీ జరుగుతోందన్న సమాచారం అందడంతో రాజేంద్ర నగర్ ఎవోటీ పోలీసులు ఫాంహౌస్ పై దాడి చేశారు. పోలీసులు వెళ్లే సమయానికి నలుగురు యువతులు అర్ధనగ్నంగా, అసభ్యకర రీతిలో డ్యాన్సులు చేస్తున్నారని సమాచారం. దీంతో ఆ పార్టీలో పాల్గొన్న ఆరుగురు యువకులు, నలుగురు యువతులను అరెస్టు చేసి మొయినాబాద్ పోలీసులకు అప్పగించారు. ప్రాథమిక విచారణలో ఆ ముజ్రా పార్టీ కోసం నలుగురు యువతులను ఢిల్లీ నుంచి తీసుకొచ్చినట్లు తెలిసిందని పోలీసులు చెప్పారు. ఫామ్‌హౌస్‌లో వారంతా అసభ్యకరరీతిలో నృత్యాలు చేశారని వివరించారు.

More Telugu News