Mahesh Babu: 'క‌ల్కి' సినిమా అద్భుతం.. నాగ్ అశ్విన్ విజ‌న్‌కు హ్యాట్సాఫ్‌: మ‌హేశ్ బాబు

Mahesh Babu stunned by Kalki 2898 AD

  • ప్ర‌భాస్‌, నాగ్ అశ్విన్ కాంబోలో వ‌చ్చిన సైన్స్ ఫిక్ష‌న్ మూవీ 'క‌ల్కి 2898'
  • మూవీపై ఇప్ప‌టికే ప‌లువురు ప్ర‌ముఖుల ప్ర‌శంస‌లు
  • తాజాగా సినిమా చూసిన మ‌హేశ్ బాబు  

రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్‌, యంగ్ డైరెక్ట‌ర్ నాగ్ అశ్విన్ కాంబినేష‌న్‌లో వ‌చ్చిన సైన్స్ ఫిక్ష‌న్ మూవీ 'క‌ల్కి 2898 ఏడీ' బ్లాక్‌బస్ట‌ర్ హిట్‌గా నిలిచిన విష‌యం తెలిసిందే. జూన్ 27న విడుద‌లైన ఈ చిత్రం.. 11 రోజుల్లోనే రూ. 900కోట్ల వ‌సూళ్లు (గ్రాస్‌) రాబ‌ట్టింది. ఇప్పుడు రూ. 1000కోట్ల వైపు ప‌రుగులు తీస్తోంది. 

ఇక ఈ మూవీపై ఇప్ప‌టికే ప‌లువురు ప్ర‌ముఖులు ప్ర‌శంస‌లు కురిపించారు. తాజాగా సినిమా చూసిన సూప‌ర్ స్టార్ మ‌హేశ్ బాబు కూడా మూవీ అద్భుతంగా ఉంద‌న్నారు. మూవీ చూసి మ‌తిపోయింద‌ని ప్రిన్స్ 'ఎక్స్' (ట్విట్ట‌ర్‌) వేదిక‌గా చిత్ర బృందాన్ని మెచ్చుకున్నారు. 

"మూవీ చూసి మ‌తిపోయింది. అద్భుతంగా ఉంది. నా మనసును కదిలించింది. జస్ట్ వావ్!. నాగ్ అశ్విన్ విజ‌న్‌కు హ్యాట్సాఫ్‌. ప్రతి ఫ్రేమ్ ఒక కళాఖండం. బిగ్‌బీ అమితాబ్ బ‌చ్చ‌న్ స్క్రీన్ ప్ర‌జెన్స్‌ను ఎవ‌రూ మ్యాచ్ చేయ‌లేరు. క‌మ‌ల్ హాస‌న్ ఏ పాత్ర పోషించినా దానికి ప్ర‌త్యేక‌త తీసుకువ‌స్తారు. ప్ర‌భాస్ మ‌రో గొప్ప సినిమాను అవ‌లీల‌గా చేసేశారు. దీపిక ఎప్ప‌టిలాగే అద్భుతంగా న‌టించారు. వైజ‌యంతి సంస్థకి, మూవీ యూనిట్‌కు కంగ్రాట్స్" అని మ‌హేశ్ బాబు ట్వీట్ చేశారు. 

మ‌హేశ్ బాబు ట్వీట్‌కు స్పందించిన క‌ల్కి మూవీ టీమ్‌.. "మైండ్ బ్లాక్ అయిపోయింది. మీ ప్ర‌శంస‌ల‌కు ధ‌న్య‌వాదాలు. హృద‌యాన్ని ప‌రిగెత్తించే మాట‌లు చెప్పారు" అంటూ రిట్వీట్ చేసింది. 


More Telugu News