Actress Anandhi: విజయ్ రాజకీయాల్లోకి రావడం ఆనందంగా ఉంది: నటి ఆనంది

Kollywood Actress Anandhi Comments On Thalapathy Vijay


రాజకీయాల్లో కాలుమోపిన కోలీవుడ్ స్టార్ నటుడు దళపతి విజయ్‌కు సినీ పరిశ్రమ నుంచి మద్దతు పెరుగుతోంది. తన మద్దతు విజయ్‌కేనని నటి నందిని ప్రకటించింది. తిరుచ్చిలో ఓ బ్యూటీ పార్లర్ ప్రారంభోత్సవానికి వచ్చిన ఆమె మాట్లాడుతూ.. రాజకీయాల్లో తన మద్దతు ఎప్పుడూ విజయ్‌కే ఉంటుందని స్పష్టం చేశారు. ప్రజా సేవ చేయాలని ఓ నటుడు రాజకీయాల్లోకి రావడం ఆనందంగా ఉందన్నారు.

‘కయల్’ మూవీతో చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టిన ఆనంది ఆ తర్వాత చండీవీరన్, పరియేరుమ్ పెరుమాళ్ వంటి సినిమాలతో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నారు. పరియేరుమ్ పెరుమాళ్ మూవీలోని ‘బొట్టా కట్టిల్ పూవాసం'తో పాటు చాలా పాటలు బాగా పాప్యులర్ అయ్యాయి. ఆనంది ప్రస్తుతం తెలుగులో ఓ వెబ్ సిరీస్‌లో నటిస్తున్నారు.

More Telugu News