Kamal Haasan: భారతీయుడు సినిమా తరువాత అవినీతి తగ్గిందా? అన్న ప్రశ్నకు కమల్ హాసన్ జవాబు

Kamal Haasan answers the question whether curruption has declined after Bharateeyudu movie

  • కమల్ హాసన్ ప్రధాన పాత్రలో భారతీయుడు-2
  • జులై 12న గ్రాండ్ రిలీజ్
  • నేడు హైదరాబాదులో చిత్రబృందం మీడియా సమావేశం

భారతీయుడు-2 చిత్రం జులై 12న ప్రేక్షకుల ముందుకు రానుండగా, నేడు హీరో కమల్ హాసన్, దర్శకుడు శంకర్, నటుడు సిద్ధార్థ్ హైదరాబాదులో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కమల్ హాసన్ ను ఓ మీడియా ప్రతినిధి ఆసక్తికర ప్రశ్న అడిగారు. 

భారతీయుడు సినిమా తర్వాత దేశంలో ఏమైనా అవినీతి తగ్గిందా? ఒకవేళ భారతీయుడు సినిమా వచ్చాక అవినీతి తగ్గి ఉంటే, ఇప్పుడు భారతీయుడు-2 సినిమా తీసే అవసరం ఉండేది కాదేమో అని ఆ మీడియా ప్రతినిధి పేర్కొన్నారు. 

అందుకు కమల్ హాసన్ స్పందిస్తూ... జవాబు కూడా మీరే చెప్పేశారు అంటూ చమత్కరించారు. అవినీతి అనేది తగ్గి ఉంటే భారతీయుడు-2 సినిమా తీసే అవసరం ఉండేది కాదని కమల్ అన్నారు. అవినీతి అనేది అంతర్జాతీయస్థాయిలో సమస్యగా ఉందని, దాన్ని దృష్టిలో ఉంచుకునే భారతీయుడు-2 తెరకెక్కించడం జరిగిందని వివరించారు. 

రాజకీయ నేతలను ప్రజాప్రతినిధులుగా ఎన్నుకోవడం, అవినీతిని ఆహ్వానించడం.... అన్నీ మనమే కదా చేస్తుంటాం అని వ్యాఖ్యానించారు. అవినీతి అంటే... అదేదో ఉన్నపళాన మన ఎదుట సంభవించే పరిణామం కాదు, దానికి మనమే బాధ్యులం అని అభిప్రాయపడ్డారు. 

భారతీయుడు-2 తెరకెక్కించడానికి అంతర్జాతీయ స్థాయిలో అవినీతి రాజకీయాలే స్ఫూర్తి అని, అందుకే ఆ రాజకీయాలకు కృతజ్ఞతలు చెబుతానని కమల్ పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News