Dadisetti Raja: పవన్ కల్యాణ్ ఆ బాధ్యత తీసుకోవాల్సిందే: మాజీ మంత్రి దాడిశెట్టి రాజా

Dadisetti Raja demands Pawan Kalyan for Kapu reservations
  • కాపులను బీసీల్లో చేర్చాలని పవన్ కు దాడిశెట్టి విన్నపం
  • ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు కూడా హామీ ఇచ్చారని వ్యాఖ్య
  • కాపు రిజర్వేషన్లకు కేంద్రం కూడా సానుకూలంగా ఉందన్న దాడిశెట్టి
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ను ఉద్దేశించి వైసీపీ నేత, మాజీ మంత్రి దాడిశెట్టి రాజా కీలక వ్యాఖ్యలు చేశారు. కాపులను బీసీల్లో చేర్చే బాధ్యతను పవన్ తీసుకోవాలని ఆయన కోరారు. తాజాగా జరిగిన ఎన్నికల్లో ఎన్డీయే కూటమికి కాపులతో పవన్ ఓట్లు వేయించారని... అందువల్ల కాపులను బీసీల్లో చేర్చే బాధ్యతను కూడా ఆయనే తీసుకోవాలని చెప్పారు. 

2019 ఎన్నికల ప్రచారంలో కాపులను బీసీల్లో చేర్చడంపై చంద్రబాబు హామీ ఇచ్చారని దాడిశెట్టి రాజా గుర్తు చేశారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఇద్దరూ కాపులకు న్యాయం చేయాలని విన్నవించారు. కాపులకు రిజర్వేషన్లను కల్పించడంపై కేంద్ర ప్రభుత్వం కూడా సానుకూలంగా ఉందని... ఈ నేపథ్యంలో కేంద్రంపై కూటమి నేతలు మరింత ఒత్తిడి చేసి కాపులను బీసీల్లో చేర్చాలని కోరారు.
Dadisetti Raja
YSRCP
Pawan Kalyan
Janasena
Kapu Reservations

More Telugu News