Jagan: జగన్ కష్టాలను దేవుడే చూసుకుంటాడు: మేనత్త విమలమ్మ

Jagan aunt Vimalamma prayer at YSR ghat in Idupulapaya

  • నేడు వైఎస్సార్ 75వ జయంతి
  • ఇడుపులపాయలో నివాళులు అర్పించిన జగన్
  • జగన్ దేవుడి యందు భయభక్తులు కలిగిన వ్యక్తి అని వెల్లడి

మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత జగన్ ఇవాళ తన తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి 75వ జయంతి సందర్భంగా ఇడుపులపాయలో నివాళులు అర్పించారు. వైఎస్సార్ ఘాట్ వద్ద జరిగిన ఈ కార్యక్రమంలో జగన్ మేనత్త విమలమ్మ ప్రార్థన చేశారు. 

"దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే ఏ కష్టము రాదు. రాదు అంటే రాకుండా ఉండడం కాదు... కష్టం వచ్చినప్పుడు దేవుడు మనతో ఉంటాడు. ఎలాంటి సమస్యలైనా ఎదుర్కోవడానికి దేవుడు మనకు శక్తిని ఇస్తాడు. 

ఇవాళ చూస్తున్నాం... జగన్ బాబు ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్నాడు. కానీ దేవుడి యందు భయభక్తులు కలిగి ఉన్నాడు కాబట్టి, అన్ని కష్టాలు వచ్చినా కూడా దేవుడు వాటిని ఎదిరించే శక్తిని ఇస్తాడు. అందుకే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. 

ప్రభువు నందు ఆనందించు వారు, ఎల్లవేళలా ఆనందిస్తారు. ఎలాంటి కష్టం వచ్చినా దేవుడు శక్తిని అందిస్తాడు... మనందరం అలాంటి శక్తి కోసం దేవుడిపై ఆధారపడాలి" అని విమలమ్మ పేర్కొన్నారు.

Jagan
Vimalamma
Prayer
YSR Ghat
Idupulapaya
  • Loading...

More Telugu News