: పెద్ద తలకాయలున్నాయ్, వాళ్లనెందుకు పట్టుకోరు?: విందూ


స్పాట్ ఫిక్సింగ్ వ్యవహారంపై విందూ దారా సింగ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేసాడు. బెట్టింగులో పెద్ద తలకాయలు చాలా ఉన్నాయనీ, రాజకీయనాయకులు, వారి తనయులు భారీ బెట్టింగులకు పాల్పడ్డారని, అయినా వారెవరూ అరెస్టు కాలేదని ఆవేదన వ్యక్తం చేసారు. తాను నిర్ధోషినని, తానే తప్పూ చేయలేదనీ అంటున్న విందూ, తన మిత్రుడు గురునాధ్ కూడా అమాయకుడని సర్టిఫికేట్ ఇచ్చేశాడు. తనకు, గురునాధ్ కు మధ్య ఆర్ధిక లావాదేవీలు జరిగినట్టు ఆధారాలు లభించలేదని పోలీసు వర్గాలు తెలపడం, తాము అమాయకులం అని చెప్పేందుకు సాక్ష్యమన్నాడు. బెట్టింగ్ లావాదేవీలన్నీ ఐపీఎల్ ముగిశాకే జరుగుతాయని, వీరిని ముందుగానే అరెస్టు చేయడంతో పోలీసులకు సరైన ఆధారాలు లభించలేదని నిపుణులు చెబుతున్నారు. దీంతో గురునాధ్, విందూలకు ముందస్తు అరెస్టుల వల్ల లాభం చేకూరిందని, లేకుంటే ఇద్దరూ నిందితులుగా మిగిలేవారని అంటున్నారు.

  • Loading...

More Telugu News