Fahadh Faasil: ఫహాద్ ఫాజిల్ 'ధూమం' .. ఇక తెలుగులో చూడొచ్చు!

Dhooma OTT release date confirmed

  • క్రితం ఏడాది థియేటర్లకు వచ్చిన 'ధూమం'
  • థ్రిల్లర్ జోనర్లో నడిచే సినిమా 
  • ఫహాద్ ఫాజిల్ జోడీగా అపర్ణ బాలమురళి  
  • ఏడాది తరువాత అందుబాటులోకి తెలుగు వెర్షన్ 
  • ఈ నెల 11వ తేదీ నుంచి 'ఆహా'లో స్ట్రీమింగ్  


క్రితం ఏడాది మలయాళంలో విజయాన్ని అందుకున్న సినిమాల జాబితాలో 'ధూమం' ఒకటిగా కనిపిస్తుంది. ఫహాద్ ఫాజిల్ కథానాయకుడిగా నటించిన ఈ సినిమాను, హోంబలే ఫిలిమ్స్ వారు నిర్మించగా, పవన్ కుమార్ దర్శకత్వం వహించాడు. సస్పెన్స్ థ్రిల్లర్ జోనర్లో రూపొందిన ఈ సినిమా, ఇప్పుడు ఓటీటీ సెంటర్లోకి అడుగుపెడుతోంది. 

ఏడాది తరువాత ఈ సినిమా తెలుగు వెర్షన్ ను 'ఆహా'లో అందుబాటులోకి తీసుకుని వచ్చారు. ఈ నెల 11వ తేదీ నుంచి 'ఆహా'లో స్ట్రీమింగ్ చేయనున్నారు. అందుకు సంబంధించిన అధికారిక ప్రకటన చేస్తూ, కొంతసేపటి క్రితం పోస్టర్ ను రిలీజ్ చేశారు. అపర్ణ బాలమురళి .. అచ్యుత కుమార్ .. పార్వతీ నాయర్ .. రోషన్ మాథ్యూ ముఖ్యమైన పాత్రలను పోషించారు. 

ఈ సినిమాలో కథానాయకుడి పేరు అవినాశ్ .. అతను ఒక సిగరెట్ కంపెనీలో సేల్స్ మేన్ గా పనిచేస్తూ ఉంటాడు. అతని భార్య దియా (అపర్ణ బాలమురళి). ఒక అజ్ఞాత వ్యక్తి అవినాశ్ కి కాల్ చేసి, తాను చెప్పినట్టుగా చేయకపోతే అతని భార్యను చంపేస్తానని బ్లాక్ మెయిల్ చేస్తుంటాడు. ఆ వ్యక్తి ఎవరు? అతని బారి నుంచి అవినాశ్ ఎలా బయటపడతాడు" అనేదే కథ.

More Telugu News