Jaganatha: పూరిలో 'గుండీచయాత్ర' వెనకున్న కథ ఇదే!

Puri Rathayatra Special

  • పూరిలో వైభవంగా జరిగే రథయాత్ర
  • ఒక్కో రథానికి ఒక్కో పేరు 
  • ఒక్కో రథం ఒక్కో ఎత్తు
  • గుండీచయాత్ర - బాహుదాయాత్ర అర్థం ఇదే
  • ఎంగిలి దోషం లేని అన్నప్రసాదం


పూరి అనగానే గుర్తుకు వచ్చేది అక్కడి జగన్నాథుడు .. అత్యంత వైభవంగా జరిగే రథయాత్ర. ఆషాడ శుద్ధ విదియనాడు జగన్నాథుడు .. బలభద్రుడు .. సుభద్ర వేరువేరు రధాలలో ఊరేగుతారు. ఈ మూడు రథాలు ఎత్తు పరంగా .. వైశాల్యం పరంగా వేరు వేరు కొలతలను కలిగి ఉంటాయి. జగన్నాథుడి రథం 45 అడుగుల ఎత్తును 16చక్రాలను కలిగి ఉంటుంది. బలభద్రుడి రథం 44 అడుగుల ఎత్తును 14 చక్రాలను కలిగి ఉంటుంది. ఇక సుభద్ర రథం 43 అడుగుల ఎత్తు - 12 చక్రాలతో కనిపిస్తుంది. 

 ఒకదాని తరువాత ఒకటిగా ఈ మూడు రథాలు ముందుకు కదులుతాయి. ఈ ఉత్సవాన్ని తిలకించడానికి లక్షల సంఖ్యలో భక్తులు దేశ విదేశాల నుంచి తరలి వస్తారు. రథయాత్ర ప్రారంభం కావడానికి ముందు పూరి రాజు బంగారు చీపురుతో రాజవీధిని కొంతవరకూ స్వయంగా ఊడుస్తారు. దీనిని 'చేరా పహరా' అని అంటారు. ఆలయం నుంచి బయల్దేరిన ఈ మూడు రథాలు 'గుండీచఘర్'కి చేరుకుంటాయి. పూరిలో స్వామివారు ఆవిర్భవించడానికి కారకుడు ఇంద్రద్యుమ్న మహారాజు .. ఆయన భార్యనే ఈ గుండికాదేవి. ఆమె పేరుతో ఉన్న మందిరానికి స్వామివారు చేరుకోవడాన్ని 'గుండీచయాత్ర' అంటారు. 

తొమ్మిదిరోజుల పాటు స్వామి ఇక్కడే విడిది చేసి, గుండీచ ఆతిథ్యాన్ని స్వీకరిస్తారు. ఆ తరువాత ఈ మూడు మూర్తులను అంతే వైభవంగా ఆలయానికి తిరిగి తీసుకొస్తారు. అలా 'గుండీచ ఘర్' నుంచి స్వామివారిని ఆలయానికి తీసుకొచ్చే ఊరేగింపును 'బాహుదా యాత్ర' అంటారు. పూరిలో అన్నప్రసాదం అత్యంత విశిష్టతను సంతరించుకుని కనిపిస్తుంది. స్వామివారికి నివేదన చేసిన అనంతరం ఆ అన్నప్రసాదాన్ని భక్తులు ఎవరికివారు తీసుకుంటారు. అక్కడ 'ఎంగిలి' అనే ఆలోచన రాదు .. ఎంగిలి దోషం ఉండదు. 

Jaganatha
Balabhadra
Subhadra
Puri
  • Loading...

More Telugu News