Russia: ప్రధాని మోదీ తమ దేశ పర్యటనకు ముందు రష్యా ఆసక్తికర వ్యాఖ్యలు

Russia said tha West was watching PM Modi trip with jealousy

  • మోదీ పర్యటన తమకు చాలా ముఖ్యమైనదన్న రష్యా
  • ఈ పర్యటనను పాశ్చాత్య దేశాలు అసూయతో చూస్తున్నాయని వ్యాఖ్య
  • నేడు, రేపు రష్యాలో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ముచ్చటగా మూడోసారి రష్యా పర్యటనకు వెళ్తున్నారు. నేడు, రేపు (జులై 8-9) ఆ దేశంలో ఆయన పర్యటించనున్నారు. అయితే మోదీ చేరుకోవడానికి ముందే రష్యా ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది. మోదీ పూర్తి స్థాయి పర్యటన తమకు చాలా ముఖ్యమైనదని వ్యాఖ్యానించింది. ఈ పర్యటనను పాశ్చాత్య దేశాలు అసూయతో చూస్తున్నాయంటూ వ్యాఖ్యానించింది. ఈ మేరకు ఆ దేశం ఒక ప్రకటన విడుదల చేసింది. ప్రధాని మోదీ, అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌ శిఖరాగ్ర స్థాయి చర్చలు చేపడతారని వెల్లడించింది. 

ఇరు దేశాల మధ్య బహుళ సంబంధాలను ఇరువురు దేశాధినేతలు సమీక్షిస్తారని భారత విదేశాంగ మంత్రిత్వశాఖ ప్రకటనలో పేర్కొంది. పరస్పర ప్రయోజనాలు, సమకాలీన ప్రాంతీయ, ప్రపంచ సమస్యలపై పరస్పరం అభిప్రాయాలను పంచుకుంటారని గురువారం విడుదల చేసిన ప్రకటనలో భారత్ పేర్కొంది. రష్యాలో ప్రధాని మోదీ కార్యక్రమం విస్తృతంగా ఉంటుందని, ఇరు దేశాల అధినేతలు చర్చలు జరుపుతారంటూ పుతిన్ ప్రెస్ సెక్రటరీ పెస్కోవ్ పేర్కొన్నారు. ఈ మేరకు రష్యా అధికార టీవీ ఛానల్ వీజీటీఆర్‌కే కు శనివారం ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన తెలిపారు. రష్యా-భారత్ సంబంధాలు వ్యూహాత్మక భాగస్వామ్యానికి సంబంధించినవని అన్నారు.

కాగా సోమ, మంగళ వారాల్లో ప్రధాని మోదీ రష్యాలో పర్యటించనున్నారు. రష్యాలో పర్యటించడం ఆయనకు ఇది మూడవసారి. అధ్యక్షుడు పుతిన్ ఆహ్వానం మేరకు భారత్-రష్యా 22వ వార్షిక శిఖరాగ్ర సమావేశంలో  పాల్గొనేందుకు మోదీ వెళ్తున్నారు. మాస్కోలో జరగనున్న శిఖరాగ్ర సమావేశంలో మోదీ-పుతిన్ ప్రత్యక్షంగా చర్చలు చేపట్టనున్నారు. కాగా 2022 ఫిబ్రవరిలో ఉక్రెయిన్‌ యుద్ధం మొదలయ్యాక ప్రధాని మోదీ రష్యాలో పర్యటించడం ఇదే తొలిసారి కావడం విశేషం.

  • Loading...

More Telugu News