Tantric Puja: గుడివాడలో క్షుద్రపూజలు.. నగ్నంగా పూజలు చేసిన తాంత్రికులు

Tantrics Performed worships naked in Gudivada
గుడివాడలో క్షుద్రపూజలు కలకలం రేపాయి. స్థానిక రాజేంద్రనగర్‌లో ఇద్దరు తాంత్రికులు శుక్రవారం రాత్రి నుంచి నిన్న ఉదయం వరకు క్షుద్రపూజలు చేసిన విషయం తెలిసి స్థానికులు భయాందోళనకు గురయ్యారు. అఘోరాలను పోలిన తాంత్రికులు విద్యాలయా పాఠశాల వెనకున్న భవనంలో అఖండదీపంతో పూజలు చేశారు. అది చూసిన స్థానికులు ఏం జరుగుతుందో తెలియక భయంతో వణికిపోయారు.

అయితే, పూజలు చేస్తున్న ఇంట్లోని వారి కుమార్తె మానసిక ఆరోగ్యం దెబ్బతినడంతో వారు ఈ తాంత్రికులను తీసుకొచ్చి పూజలు చేయించినట్టు తెలుస్తోంది. స్థానికుల సమాచారంతో అక్కడికి వెళ్లిన పోలీసులు వారిని హెచ్చరించి పంపేసినట్టు తెలిసింది.
Tantric Puja
Gudivada
Andhra Pradesh
Naked Worships

More Telugu News