Gutta Jwala: మీరు చెప్పిన మందులు వాడి ఎవరైనా చనిపోతే మీరు బాధ్యత వహిస్తారా?: సమంతను ప్రశ్నించిన గుత్తా జ్వాల!

Gutta Jwala questions Samantha

  • కొన్నేళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్న సమంత
  • ఓ ప్రత్యామ్నాయ చికిత్స తనకు బాగా పనిచేసిందని వెల్లడి
  • కొన్ని మందులు కూడా సూచించిన సమంత
  • సమంతను జైల్లో పెట్టాలన్న ఓ వైద్యుడు
  • ఈ వ్యవహారంపై స్పందించిన గుత్తా జ్వాల

గత కొన్నేళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్న ప్రముఖ నటి సమంత... తాను అనేక సంప్రదాయ వైద్య విధానాలు ప్రయత్నించామని, ఓ డాక్టర్ సూచించిన ప్రత్యామ్నాయ చికిత్స బాగా పనిచేసిందని ఇటీవల వెల్లడించారు. ఈ ట్రీట్ మెంట్ లో ఏ మందులు వాడాలో కూడా సమంత తెలిపారు. అంతేకాదు, తనకు ఆ ట్రీట్ మెంట్ సూచించిన వైద్యుడి పేరును కూడా ట్యాగ్ చేశారు. 

ఈ వ్యవహారంలో మరో వైద్యుడు జోక్యం చేసుకుని సమంత తీరును ప్రశ్నించారు. ఇలాంటి తప్పుడు సలహాలు ఇస్తున్నందుకు సమంతను జైల్లో పెట్టాలని అన్నారు. ఇప్పుడీ వివాదంలోకి తాజాగా ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి గుత్తా జ్వాల కూడా ఎంటరయ్యారు. మీరు (సమంత) చెప్పినట్టు మందులు వాడి ఎవరైనా చనిపోతే మీరు బాధ్యత వహిస్తారా? అని జ్వాల ప్రశ్నించారు. 

"తనను ఫాలో అయ్యే ఎంతోమంది అభిమానులకు మందులను సూచిస్తున్న ఆమెకు నాదో ప్రశ్న... సహాయం చేయాలన్నదే ఆమె ఉద్దేశం కావొచ్చు.... కానీ పరిస్థితులు అనుకూలించక, సూచించిన మందులు పనిచేయక, ప్రాణాపాయం కలిగితే అందుకు కూడా మీరు బాధ్యత స్వీకరిస్తారా? మీరు ట్యాగ్ చేసిన డాక్టర్ కూడా బాధ్యత తీసుకుంటారా?" అంటూ జ్వాల ప్రశ్నించారు.

Gutta Jwala
Samantha
Treatment
Tollywood
Badminton
  • Loading...

More Telugu News