Chandrababu: ప్రజాభవన్ కు చేరుకున్న చంద్రబాబు... స్వాగతం పలికిన రేవంత్ రెడ్డి

Chandrababu arrives Praja Bhavan in Hyderabad
  • హైదరాబాదులో ఉభయ రాష్ట్రాల సీఎంల సమావేశం
  • ప్రజాభవన్ వేదికగా సమావేశం కానున్న రేవంత్ రెడ్డి, చంద్రబాబు
  • పెండింగ్ లో ఉన్న విభజన అంశాలపై చర్చ
విభజన అంశాలపై చర్చల కోసం ఏపీ సీఎం చంద్రబాబు హైదరాబాద్ లోని ప్రజాభవన్ కు విచ్చేశారు. చంద్రబాబుకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా వచ్చి స్వాగతం పలికారు. ఆయన వెంట తెలంగణ మంత్రులు కూడా వచ్చి చంద్రబాబుకు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డికి పుష్పగుచ్ఛం అందించిన చంద్రబాబు శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం చంద్రబాబును తోడ్కొని రేవంత్ రెడ్డి సమావేశం జరిగే హాలులోకి వెళ్లారు. వారి వెంట ఇరు రాష్ట్రాల మంత్రులు, వివిధ శాఖల అధికారులు కూడా వెళ్లారు. ప్రస్తుతం సమావేశం ప్రారంభమైంది. 

Chandrababu
Praja Bhavan
Revanth Reddy
Andhra Pradesh
Telangana

More Telugu News