Kakani Govardhan Reddy: సోమిరెడ్డి అవినీతిపై ఆధారాలు ఇస్తా.. దమ్ముంటే విచారణ జరిపించండి: కాకాణి గోవర్ధన్

Kakani Govardhan Reddy demands inquiry on Somireddy

  • తనపై వ్యక్తిగత దుష్ప్రచారానికి పాల్పడుతున్నారన్న కాకాణి
  • 2014లో టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత అక్రమ లేఔట్లు వేశారని ఆరోపణ
  • సోమిరెడ్డి అనుచరుడు ఆలయ భూములను ఆక్రమించాడన్న కాకాణి

రాజకీయంగా తనను ఎదుర్కోలేక వ్యక్తిగత దుష్ప్రచారానికి పాల్పడుతున్నారని టీడీపీ ఎమ్మెల్యే సోమిరెడ్డిపై మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ మండిపడ్డారు. 2014లో టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత అక్రమ లేఔట్లు వేశారని... సోమిరెడ్డి అనుచరుడు పోలేరమ్మ ఆలయ భూములను కూడా ఆక్రమించారని చెప్పారు. 

అక్రమ లేఔట్లపై అప్పట్లోనే జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేశామని... 40 లేఔట్లు ఉన్నాయని డివిజనల్ పంచాయతీ అధికారి నివేదిక ఇచ్చారని తెలిపారు. టీడీపీ ప్రభుత్వ హయాంలోనే విజిలెన్స్ అధికారులు విచారణ చేసి రూ. 6.5 కోట్లు జరిమానా విధించారని.. అయితే, సోమిరెడ్డి జోక్యం చేసుకుని జరిమానా కట్టకుండా చేశారని చెప్పారు. 

తన వద్ద అన్ని ఆధారాలు ఉన్నాయని... దమ్ముంటే ప్రస్తుత టీడీపీ ప్రభుత్వం విచారణ జరపాలని సవాల్ విసిరారు. పొదలకూరులోని లేఔట్ వారితో నెల రోజులుగా సోమిరెడ్డి లావాదేవీలు జరుపుతున్నారని... చర్చలు సఫలం కాకపోవడంతో నుడా అధికారులతో పోలీసులకు ఫిర్యాదు చేయించారని తెలిపారు. సోమిరెడ్డి అవినీతిపై ఆధారాలు ఇస్తామని... దమ్ముంటే విచారణ జరపాలని ఛాలెంజ్ చేశారు.

Kakani Govardhan Reddy
YSRCP
Somireddy Chandra Mohan Reddy
Telugudesam
  • Loading...

More Telugu News