Team India: జింబాబ్వేతో తొలి టీ20... టాస్ గెలిచిన టీమిండియా

Team India opt bowling against Zimbabwe in 1st T20

  • జింబాబ్వేలో టీమిండియా పర్యటన
  • ఇరు జట్ల మధ్య ఐదు టీ20ల సిరీస్
  • హరారేలో నేడు తొలి మ్యాచ్
  • టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న టీమిండియా

శుభ్ మాన్ గిల్ సారథ్యంలోని యువ టీమిండియా జట్టు జింబాబ్వేతో ఐదు మ్యాచ్ ల టీ20 సిరీస్ ఆడనుంది. నేడు ఇరు జట్ల మధ్య తొలి టీ20 మ్యాచ్ జరగనుంది. హరారేలోని స్పోర్ట్స్ క్లబ్ స్టేడియం ఈ మ్యాచ్ కు వేదిక. టాస్ గెలిచిన టీమిండియా బౌలింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్ ద్వారా అభిషేక్ శర్మ, రియాన్ పరాగ్ టీమిండియా తరఫున అంతర్జాతీయ అరంగేట్రం చేస్తున్నారు. ధ్రువ్ జురెల్ కూడా టీ20ల్లో అరంగేట్రం చేస్తున్నాడు. మరోవైపు కొందరు సీనియర్ ఆటగాళ్లు లేకుండానే జింబాబ్వే బరిలో దిగుతోంది. ఈ జట్టుకు సీనియర్ ఆల్ రౌండర్ సికిందర్ రజా కెప్టెన్ గా వ్యవహరిస్తున్నాడు.

More Telugu News