Keir Starmer: బ్రిటన్ నూతన ప్రధాని కీర్ స్టార్మర్ కు శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని మోదీ

PM Modi congratulates UK new prime minister Keir Starmer

  • బ్రిటన్ ఎన్నికల్లో లేబర్ పార్టీ ఘనవిజయం
  • ప్రధాని పదవికి రిషి సునాక్ రాజీనామా
  • ప్రధాని పీఠం ఎక్కబోతున్న కీర్ స్టార్మర్

బ్రిటన్ ఎన్నికల్లో కీర్ స్టార్మర్ నాయకత్వంలోని లేబర్ పార్టీ 412 స్థానాలతో ఘనవిజయం సాధించడం తెలిసిందే. రిషి సునాక్ సారథ్యంలోని కన్జర్వేటివ్ పార్టీ కేవలం 121 స్థానాలకే పరిమితమైంది. ప్రధాని పదవికి రిషి సునాక్ రాజీనామా చేయగా... బ్రిటన్ నూతన ప్రధానిగా కీర్ స్టార్మర్ పగ్గాలు అందుకోనున్నారు. 

ఈ నేపథ్యంలో, భారత ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు. బ్రిటన్ నూతన ప్రధాని కాబోతున్న కీర్ స్టార్మర్ తో మాట్లాడడం ఎంతో సంతోషం కలిగించిందని వెల్లడించారు. ప్రధానమంత్రి పీఠం ఎక్కుతున్న కీర్ స్టార్మర్ కు శుభాకాంక్షలు తెలిపానని వివరించారు. ఇరుదేశాల సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యం, ఇరుదేశాల ప్రజల సంక్షేమం, అభివృద్ధి, ప్రపంచ హితం దిశగా దృఢమైన ఆర్థిక సంబంధాలను మరింత బలోపేతం చేయడానికి తాము కట్టుబడి ఉంటామని మోదీ ట్వీట్ చేశారు.

  • Loading...

More Telugu News