K Keshav Rao: తెలంగాణ ప్రభుత్వ సలహాదారుగా కె.కేశవరావు నియామకం

K Keshava Rao as Advisor to TG government

  • కేబినెట్ హోదాతో పబ్లిక్ అఫైర్స్ సలహాదారుగా నియామకం
  • ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం
  • ఇటీవల కాంగ్రెస్ పార్టీలో చేరిన కేశవరావు

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుగా సీనియర్ నాయకుడు కె.కేశవరావు నియమితులయ్యారు. ఆయనకు కేబినెట్ హోదాను కల్పించారు. కేబినెట్ హోదాతో పబ్లిక్ అఫైర్స్ సలహాదారుగా ఆయనను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జీవో జారీ చేసింది. కేశవరావు ఇటీవల బీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిల సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. అనంతరం తన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఆయన రాజీనామాను కూడా రాజ్యసభ చైర్మన్ ఆమోదించారు.

More Telugu News