Krishna Mohan Reddy: బీఆర్ఎస్ కు మరో షాక్.. కాంగ్రెస్ లో చేరిన ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి

BRS MLA Krishna Mohan Reddy joins Congress

  • బీఆర్ఎస్ కు గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి రాజీనామా
  • రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ లో చేరిక
  • ఇప్పటి వరకు కాంగ్రెస్ లో చేరిన ఏడుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు

బీఆర్ఎస్ పార్టీకి వరుస షాకులు తగులుతున్నాయి. పార్టీ నేతలు వరుసబెట్టి బీఆర్ఎస్ కు గుడ్ బై చెపుతున్నారు. ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పార్టీని వీడారు. ఇటీవలే ఏకంగా ఆరుగురు ఎమ్మెల్సీలు కాంగ్రెస్ లో చేరడంతో బీఆర్ఎస్ తీవ్ర ఒత్తిడికి గురవుతోంది. 

ఈ క్రమంలో తాజాగా మరో ఎమ్మెల్యే బీఆర్ఎస్ కు షాకిచ్చారు. గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి బీఆర్ఎస్ కు గుడ్ బై చెప్పారు. బీఆర్ఎస్ కు ఆయన రాజీనామా చేశారు. కారు దిగిన ఆయన... హస్తాన్ని అందుకున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జి దీపాదాస్ మున్షీ సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. కృష్ణమోహన్ రెడ్డి కాంగ్రెస్ లో చేరడంతో... ఇప్పటి వరకు కాంగ్రెస్ లో చేరిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేల సంఖ్య 7కు చేరుకుంది.

More Telugu News