Hatras Stampade: హత్రాస్ ఘటన తర్వాత తొలిసారి పెదవి విప్పిన భోలేబాబా

Bhole Baba releases first video message after Hathras stampede

  • హత్రాస్ తొక్కిసలాటలో 121 మంది మృతి
  • ఘటనకు కారణమైన వారు తప్పించుకోలేరని వ్యాఖ్య
  • బాధిత కుటుంబాలకు అండగా నిలబడాలని తన కమ్యూనిటీ సభ్యులకు పిలుపు
  • ఈ కేసులో ఇప్పటి వరకు ప్రధాన నిందితుడు సహా ఆరుగురి అరెస్ట్

ఉత్తరప్రదేశ్‌లోని హత్రాస్‌లో ఈ నెల 2న భోలేబాబా సత్సంగ్‌లో జరిగిన తొక్కిసలాటలో 121 మంది ప్రాణాలు కోల్పోయారు. వందలాదిమంది గాయపడ్డారు. ఈ ఘటన తర్వాత భోలేబాబా తొలిసారి స్పందించారు. ఈ విషాదంపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఘటనకు కారకులైన నిందితులు తప్పించుకోలేరని విశ్వాసం వ్యక్తం చేశారు. బాధితుల కుటుంబాల పక్షాన నిలబడాలని తన కమ్యూనిటీ సభ్యులను కోరుతూ ఆయన ఓ వీడియోను విడుదల చేశారు. ఈ ఘటనకు సంబంధించి భోలేబాబాను విచారించాలని అధికారులు యోచిస్తున్న నేపథ్యంలో ఆయనీ వీడియోను విడుదల చేయడం గమనార్హం.

తొక్కిసలాట ఘటనలో ప్రధాన నిందితుడిగా భావిస్తున్న దేవప్రకాశ్ మధూకర్‌ను ఢిల్లీలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులో గురువారం రాత్రి వరకు ఇద్దరు మహిళా వాలంటీర్లు సహా ఆరుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

  • Loading...

More Telugu News