Sudha Murthy: 30 ఏళ్లుగా ఒక్క చీర కూడా కొనని సుధామూర్తి!

Sudha murthy on why she gave up shopping years ago

  • కాశీకి వెళ్లినప్పుడు తనకిష్టమైన షాపింగ్ అలవాటును వదిలేశానన్న సుధామూర్తి
  • నిరాడంబర జీవన శైలి తనకు తల్లి, అమ్మమ్మల నుంచి వారసత్వంగా సంక్రమించిందని వెల్లడి
  • సాధారణ జీవితం గడిపేందుకు తానెప్పుడూ ఇబ్బంది పడలేదని వ్యాఖ్య

తాను 30 ఏళ్లుగా ఒక్క చీర కూడా కొనుగోలు చేయలేదని రాజ్యసభ ఎంపీ, ఇన్ఫోసిస్ సహవ్యవస్థాపకుడు నారాయణ మూర్తి అర్ధాంగి సుధామూర్తి ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. స్నేహితులు, బంధువులు బహుమతిగా ఇచ్చిన చీరలనే ధరిస్తున్నానని అన్నారు. తనకు చాల ఇష్టమైన షాపింగ్‌ను కాశీలో వదులుకోవడంతో చీరలు కొనుగోలు చేయలేదని తెలిపారు. తన తల్లి, అమ్మమ్మ అత్యంత సాధారణ జీవితం గడిపారని, వారి నుంచి తనకు నిరాడంబర జీవనశైలి వారసత్వంగా వచ్చిందని చెప్పారు. కాబట్టి, తను సులువుగా సర్దుకుపోగలిగానని తాజాగా ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. 

‘‘ఆరేళ్ల క్రితం నా తల్లి చనిపోయినప్పుడు ఆమె కప్ బోర్డును ఖాళీ చేసేందుకు ఇతరులకు ఇచ్చేందుకు ఎక్కువ సమయం పట్టలేదు. ఎందుకంటే ఆవిడ వద్ద 8 - 10 చీరలే ఉండేవి. 36 ఏళ్ల క్రితం మా అమ్మమ్మ చనిపోయింది. అప్పట్లో ఆమె వద్ద నాలుగు మాత్రమే ఉండేవి. వారందరూ అత్యంత నిరాడంబర జీవితం గడిపారు. కాబట్టి, ఆ విలువలతోనే నన్ను పెంచారు. వస్తు వ్యామోహం లేని నిరాడంబర జీవితాన్ని గడిపేందుకు నేనెప్పుడూ ఇబ్బంది పడలేదు’’ అని ఆమె వివరించారు.

  • Loading...

More Telugu News