Pinnelli Ramakrishna Reddy: పిన్నెల్లిని పోలీస్ కస్టడీకి అప్పగించిన కోర్టు
- ఈవీఎం ధ్వంసం చేసిన పిన్నెల్లి
- పోలింగ్ ఏజెంట్ పై హత్యాయత్నం కేసు కూడా నమోదు
- ప్రస్తుతం నెల్లూరు జైలులో పిన్నెల్లి
- అదనపు విచారణ కోసం కస్టడీకి అప్పగించాలన్న పోలీసులు
- రెండ్రోజుల కస్టడీకి అనుమతినిచ్చిన మాచర్ల కోర్టు
వైసీపీ మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కస్టడీకి కోర్టు అనుమతించింది. ఈవీఎం పగులగొట్టడం, పోలింగ్ ఏజెంట్ పై హత్యాయత్నం కేసులను ఎదుర్కొంటున్న పిన్నెల్లి ప్రస్తుతం నెల్లూరు జైల్లో ఉన్నారు.
అదనపు విచారణ కోసం పిన్నెల్లిని కస్టడీకి ఇవ్వాలంటూ పోలీసులు మాచర్ల కోర్టును కోరారు. పోలీసుల విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకున్న న్యాయమూర్తి... పిన్నెల్లిని రెండ్రోజుల కస్టడీకి అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి ఏపీలో పోలింగ్ రోజున పాల్వాయిగేట్ పోలింగ్ బూత్ లోకి ప్రవేశించి ఈవీఎం ధ్వంసం చేయడం వీడియోల ద్వారా వెల్లడైంది. అదే పోలింగ్ బూత్ లో టీడీపీ ఏజెంట్ గా ఉన్న నంబూరి శేషగిరిరావు, తనను చంపేయాలంటూ పిన్నెల్లి వైసీపీ శ్రేణులను ఉసిగొల్పారంటూ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఆయనపై హత్యాయత్నం కేసు నమోదైంది.