Rohit Sharma: ఈ ప్ర‌పంచ‌క‌ప్ మీ కోస‌మే.. రోహిత్ శ‌ర్మ ట్వీట్ వైర‌ల్‌!

Rohit Sharma Special Tweet


టీ20 ప్ర‌పంచ‌క‌ప్ ట్రోఫీతో స్వ‌దేశానికి తిరిగొచ్చిన భార‌త‌ జ‌ట్టుకు ముంబైలో అభిమానులు క‌నీవిని ఎరుగ‌ని రీతిలో అపూర్వ‌స్వాగ‌తం ప‌లికారు. దీనిపై టీమిండియా కెప్టెన్ రోహిత్‌ శ‌ర్మ ఎంతో ఆనందం వ్య‌క్తం చేశాడు. ఈ సంద‌ర్భంగా 'ఎక్స్' (ట్విట్ట‌ర్‌) వేదిక‌గా ప్ర‌త్యేకంగా ఓ పోస్టు పెట్టాడు. 'ఈ క‌ప్ మీ కోసమే..' అని పేర్కొంటూ జాతీయ జెండాను పోస్టు చేశాడు. అలాగే తాను ఓపెన్ టాప్ బ‌స్సులో వ‌ర‌ల్డ్‌క‌ప్‌ను ఎత్తుకుని ఫ్యాన్స్‌కు అభివాదం చేస్తున్న ఫొటోను కూడా జ‌త చేశాడు. ఇప్పుడీ ట్వీట్ వైర‌ల్ అవుతోంది.

More Telugu News