Andhra Pradesh: ప్ర‌భుత్వ టీచ‌ర్‌పై టీడీపీ నేత, రేష‌న్ డీల‌ర్‌ బూతుపురాణం.. వీడియో వైర‌ల్‌!

TDP Leader Abused To Government Teacher

  • క‌ర్నూలు జిల్లా కొలిమిగుండ్ల మండ‌లం కోర్న‌ప‌ల్లెలో రేష‌న్ డీల‌ర్ రౌడీయిజం
  • స్కూల్‌లో రేష‌న్ బియ్యం బ‌స్తాలు పెట్టొద్ద‌న్నందుకు బండ బూతులు తిట్టిన వైనం
  • ఇక్క‌డ ఉండ‌క‌పోతే వెళ్లిపో అని టీచ‌ర్‌పై డీల‌ర్ విజ‌య్ భాస్క‌ర్ బూతుపురాణం  

ప్ర‌భుత్వ పాఠ‌శాల‌లో రేష‌న్ బియ్యం బ‌స్తాలు దించొద్ద‌ని, విద్యార్థుల‌కు ఇబ్బంది క‌లుగుతుంద‌ని చెప్పిన ఉపాధ్యాయుడిపై టీడీపీ నేత, రేష‌న్ డీల‌ర్ విజ‌య్ భాస్క‌ర్ బండ‌ బూతుల‌తో రెచ్చిపోయాడు. ఎందుకు పెట్ట‌కూడ‌దంటూ టీచ‌ర్‌ను నోటికి వ‌చ్చిన తిట్లు తిట్టాడు. ఈ ఘ‌ట‌న క‌ర్నూలు జిల్లా కొలిమిగుండ్ల మండ‌లం కోర్న‌ప‌ల్లెలో జ‌రిగింది. 

"ఎవ‌డు ఎంఈఓ.. లోఫ‌ర్ నా కొడ‌కా.. మాకు 164 సీట్లు వ‌చ్చాయి. మ‌ర్యాద నేర్చుకో నువ్వు. స్టోర్ బియ్యం బ‌డిలో దించుతాం. ఇక్క‌డ ఉండ‌క‌పోతే వెళ్లిపో" అని డీల‌ర్ విజ‌య్ భాస్క‌ర్ టీచ‌ర్‌ను దుర్భాష‌లాడాడు. దాంతో ఆ తిట్లు భ‌రించ‌లేక ప్ర‌భుత్వ ఉపాధ్యాయుడు త‌ల దించుకుని క‌న్నీళ్లు పెట్టుకున్నారు. ఈ వీడియో ప్ర‌స్తుతం సామాజిక మాధ్య‌మాల్లో వైర‌ల్ అవుతోంది. 

Andhra Pradesh
Kurnool District
Government Teacher
TDP Leader
Ration Dealer

More Telugu News