Virat Kohli: కలిసి డ్యాన్స్ వేసిన రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ.. దద్దరిల్లిపోయిన స్టేడియం.. వీడియో ఇదిగో

Fans cheered as Virat Kohli and Rohit Sharma dance together at Wankhede Stadium

  • చెక్ దే ఇండియా డీజే పాటకు కలిసి డ్యాన్స్ వేసిన స్టార్ ప్లేయర్
  • వీరికి జత కలిసిన ఇతర ఆటగాళ్లు
  • ఒక్కసారిగా దద్దరిల్లిపోయిన వాంఖెడే స్టేడియం


టీ20 వరల్డ్ కప్ 2024 విజేతగా నిలిచిన భారత క్రికెట్ జట్టుకు ముంబైలోని వాంఖెడే స్టేడియంలో గురువారం ఘన సన్మానం జరిగింది. క్రికెటర్ల సందడి మధ్య జరిగిన ఈ కార్యక్రమానికి సంబంధించిన దృశ్యాలు క్రికెట్ ఫ్యాన్స్‌ను ఆకట్టుకున్నాయి.

ముఖ్యంగా స్టేడియంలో భారత కెప్టెన్ రోహిత్ శర్మ, స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ కలిసి డ్యాన్స్ చేయడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. చక్ దే ఇండియా డీజే పాట ప్లే చేసినప్పుడు విరాట్, రోహిత్ తమ నృత్య నైపుణ్యాలను ప్రదర్శించారు. దిగ్గజాలు ఇద్దరూ డ్యాన్స్ చేయడం చూసి స్టేడియం మొత్తం దద్దరిల్లిపోయింది. అభిమానులు పెద్ద ఎత్తున కేరింతలు కొట్టారు. అరుపులు, కేకలతో స్టేడియాన్ని మోతెక్కించారు. ఇక వీరిద్దరి డ్యాన్స్ చూసి ఇతర ఆటగాళ్లు కూడా ఆనందోత్సాహాల్లో మునిగిపోయారు. విరాట్, రోహిత్ డ్యాన్స్‌కు ఇతర ఆటగాళ్లు కూడా జతయ్యారు. అందరూ కలిసి నృత్యం చేశారు. 

కాగా గురువారం భారత ఆటగాళ్లను సన్మానించేందుకు ముంబైలో నిర్వహించిన విజయ్ పరేడ్, స్వాగత కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో క్రికెట్ అభిమానులు పాల్గొన్నారు. మెరైన్ డ్రైవ్ నుంచి వాంఖెడే స్టేడియం వరకు ఓపెన్ బస్సులో ప్రయాణించారు. అభిమానులకు అభివాదం చేస్తూ స్టేడియానికి చేరుకున్నారు. ఇక బీసీసీఐ మొత్తం రూ.125 కోట్ల నగదు బహుమతితో ఆటగాళ్లను సత్కరించింది.

  • Loading...

More Telugu News