Chandrababu: వికసిత ఏపీ నిర్మాణానికి కట్టుబడి ఉన్నామన్న అమిత్ షా... కృతజ్ఞతలు తెలిపిన చంద్రబాబు

AP CM Chandrababu thanked Amit Shah


ఢిల్లీ పర్యటనలో భాగంగా ఏపీ సీఎం చంద్రబాబు కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలిశారు. చంద్రబాబుతో సమావేశంపై అమిత్ షా సోషల్ మీడియాలో స్పందించగా... చంద్రబాబు కృతజ్ఞతలు తెలిపారు. 

"ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు, ఇతర టీడీపీ నేతలతో సమావేశం అయ్యాను. దేశంతో పాటు రాష్ట్ర ప్రగతిని వేగవంతం చేయడానికి సంబంధించిన అనేక విషయాలపై మేం చర్చించాం. వికసిత భారత్, వికసిత ఆంధ్రప్రదేశ్ నిర్మాణానికి ఎన్డీయే ప్రభుత్వం కట్టుబడి ఉంది" అంటూ అమిత్ షా ట్వీట్ చేశారు. 

దీనిపై చంద్రబాబు స్పందించారు. "ధన్యవాదాలు అమిత్ షా గారూ. వికసిత భారత్, వికసిత ఆంధ్రప్రదేశ్ లక్ష్యంగా పనిచేసేందుకు మేం సర్వసన్నద్ధంగా ఉన్నాం. ప్రజల ఆకాంక్షలను తీర్చేందుకు సదా మీ సహకారం అవసరం" అంటూ చంద్రబాబు ట్వీట్ చేశారు. 

అమిత్ షాతో చంద్రబాబు భేటీలో కేంద్ర సహాయమంత్రులు పెమ్మసాని చంద్రశేఖర్, భూపతిరాజు శ్రీనివాసవర్మ, టీడీపీ ఎంపీలు లావు శ్రీకృష్ణదేవరాయలు, భరత్ తదితరులు కూడా పాల్గొన్నారు.

Chandrababu
Amit Shah
New Delhi
NDA
TDP-JanaSena-BJP Alliance
Andhra Pradesh
  • Loading...

More Telugu News