: మళ్లీ ఆసుపత్రిలో చేరిన నెల్సన్ మండేలా


దక్షిణాఫ్రికా మాజీ అధ్యక్షుడు నెల్సన్ మండేలా(94) అనారోగ్యం కారణంగా మరోసారి ఆసుపత్రి పాలయ్యారు. ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ తిరగబెట్టడంతో ఈ ఉదయం 1.30 గంటలకు మండేలాను ప్రిటోరియా ఆసుపత్రిలో చేర్పించారు. అయితే, అధ్యక్షుడి ఆరోగ్య పరిస్థితి స్థిరంగా ఉందని దక్షిణాఫ్రికా అధ్యక్షుడు జాకబ్ జుమా కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది. గతంలోనూ అనారోగ్యం కారణంగా ఆసుపత్రిలో చేరిన మండేలా పదిరోజుల చికిత్స అనంతరం ఏప్రిల్ 6న డిశ్చార్జ్ అయ్యారు.

  • Loading...

More Telugu News