Pawan Kalyan: సమాజ క్షేమాన్ని కోరుతూ పవన్ కల్యాణ్ సూర్యారాధన... ఫొటోలు చూశారా?

Pawan Kalyan prays god of Sun

  • మంగళగిరిలోని జనసేన పార్టీ  కార్యాలయంలో సూర్యారాధన కార్యక్రమం
  • వేద మంత్రాల మధ్య పవన్ పూజాదికాలు
  • ప్రస్తుతం వారాహి దీక్షలో ఉన్న ఏపీ డిప్యూటీ సీఎం

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ గత కొన్నిరోజులుగా వారాహి అమ్మవారి దీక్షలో ఉన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఆయన సమాజ హితాన్ని కాంక్షిస్తూ సూర్యారాధన ఆచరిస్తున్నారు. విజ్ఞానాభివృద్ధికి, సుఖసంతోషాలకు, క్షేమానికి ప్రత్యక్ష భగవానుడు సూర్యుడు. అందుకే భారతీయ సంస్కృతిలో సూర్యారాధన ఒక భాగమైంది. 

ఈ నేపథ్యంలో, పవన్ కల్యాణ్ మంగళగిరిలోని జనసేన పార్టీ ప్రధాన కార్యాలయంలో సూర్యారాధన చేపట్టారు. వేదపండితుల సమక్షంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఆదిత్య యంత్రం ఎదుట ఆసీనుడైన పవన్ కల్యాణ్ సూర్య నమస్కార ప్రకరణం నిర్వహించారు. దీనికి సంబంధించిన ఫొటోలను జనసేన పార్టీ సోషల్ మీడియాలో పంచుకుంది.

Pawan Kalyan
Surya Aradhana
Janasena
Andhra Pradesh
  • Loading...

More Telugu News