Medchal Malkajgiri District: మల్కాజ్‌గిరి ఎమ్మెల్యేకు నిరసన సెగ

Proest in front of Malkajgiri MLA

  • మౌలాలీ ఆర్టీసీ కాలనీలో ఎమ్మెల్యేకు నిరసన సెగ
  • మెయిన్ రోడ్డు పనులు మరమ్మతులు చేపట్టకుండా వదిలేశారని ఆగ్రహం
  • పలుమార్లు ఆందోళనలు చేపట్టినప్పటికీ ఫలితం లేదని ఆవేదన

మల్కాజ్‌గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డికి నిరసన సెగ తగిలింది. మౌలాలీ ఆర్టీసీ కాలనీలో నెలలుగా మెయిన్ రోడ్డు మరమ్మతులు చేయకుండా వదిలేశారని స్థానిక ప్రజలు ఎమ్మెల్యే ఎదుట నిరసన తెలిపారు. పలుమార్లు ఆందోళనలు చేపట్టినప్పటికీ ఫలితం లేకుండా పోయిందని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో తమ ప్రాంతానికి వచ్చిన ఎమ్మెల్యేను కొందరు నిలదీశారు. అయితే ఎమ్మెల్యేను ప్రశ్నించిన వారిపై కొంతమంది దాడికి యత్నించారు. దీంతో అక్కడ ఉద్రిక్తత ఏర్పడింది. పోలీసులు జోక్యం చేసుకొని ఇరువర్గాలను చెదరగొట్టారు.

Medchal Malkajgiri District
Marri Rajasekhar Reddy
MLA
  • Loading...

More Telugu News