Team India: వాంఖెడే స్టేడియంలో టీమిండియాకు సన్మానం... మెరైన్ డ్రైవ్ లో అటు అరేబియా సముద్రం, ఇటు జనసముద్రం

Mumbai marine drive filled with crowd awaiting for Team India


ఐసీసీ టీ20 వరల్డ్ కప్-2024 విజేత టీమిండియా ఇవాళ స్వదేశం చేరుకున్న సంగతి తెలిసిందే. ఈ సాయంత్రం వరల్డ్ కప్ నెగ్గిన టీమిండియా ఆటగాళ్లకు ముంబయిలోని వాంఖెడే స్టేడియంలో సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆటగాళ్లకు బీసీసీఐ రూ.125 కోట్ల భారీ నజరానా అందించనుంది. 

కాగా, తమ అభిమాన ఆటగాళ్లను చూసేందుకు వచ్చిన జనంతో ముంబయి మెరైన్ డ్రైవ్ ప్రాంతం క్రిక్కిరిసిపోయింది. అటు అరేబియా సముద్రం, ఇటు జనసముద్రం అన్నట్టుగా ఆ ప్రాంతం అంతా క్రికెట్ అభిమానులతో నిండిపోయింది. మెరైన్ డ్రైవ్ నుంచి ఆటగాళ్లు ప్రత్యేక ఓపెన్ టాప్ బస్సులో వాంఖె ే స్టేడియం వరకు ఊరేగింపుగా వెళ్లనున్నారు. అటు, వాంఖెడే స్టేడియంలోనూ అభిమానులు పోటెత్తారు.

More Telugu News