Stock Market: మదుపరుల లాభాల స్వీకరణ... ఫ్లాట్ గా ముగిసిన స్టాక్ మార్కెట్

Stock markets today ends flat

  • ఫ్లాట్ గా ముగిసిన సెన్సెక్స్, నిఫ్టీ
  • ట్రేడింగ్ ప్రారంభంలో సరికొత్త గరిష్ఠాల నమోదు
  • క్రమంగా నెమ్మదించిన సూచీలు

ఇవాళ భారత స్టాక్ మార్కెట్ సూచీలు ఫ్లాట్ గా ముగిశాయి. ఉదయం ట్రేడింగ్ ఆరంభంలో సరికొత్త గరిష్ఠాలను అందుకున్న సెన్సెక్స్, నిఫ్టీ... సాయంత్రం నాటికి స్వల్ప లాభాలతో సరిపెట్టుకున్నాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 62.88 పాయింట్ల వృద్ధితో 80,049.67 వద్ద ముగిసింది. నిఫ్టీ 15.65 పాయింట్ల వృద్ధితో 24,302.15 వద్ద స్థిరపడింది. 

ఉదయం సెషన్ లో సెన్సెక్స్ 80,392 వద్ద సరికొత్త గరిష్ఠాన్ని నమోదు చేసింది. అక్కడ్నించి మదుపరులు లాభాల స్వీకరణకు మొగ్గు చూపడంతో ఫ్లాట్ గా ముగిసింది. నిఫ్టీలోనూ ఇదే ఒరవడి కనిపించింది. అయినప్పటికీ స్టాక్ మార్కెట్ సూచీలు వరుసగా నాలుగో రోజూ కూడా లాభాలతోనే ముగిశాయి. 

ఇవాళ్టి ట్రేడింగ్ లో సన్ ఫార్మా, టాటా మోటార్స్, ఐసీఐసీఐ బ్యాంక్, హెచ్ సీఎల్ టెక్నాలజీస్, టీసీఎస్ షేర్లు లాభాలు అందుకోగా... ఎల్ అండ్ టీ, అల్ట్రాటెక్ సిమెంట్, హెచ్ డీఎఫ్ సీ బ్యాంక్, బజాజ్ ఫైనాన్స్, టెక్ మహీంద్రా షేర్లు నష్టపోయాయి.

  • Loading...

More Telugu News