Hemant Soren: ఝార్ఖండ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన హేమంత్ సోరెన్

Hemant Soren takes oath as Jharkhand CM

  • భూ కుంభకోణం కేసులో హేమంత్ సోరెన్ ను అరెస్ట్ చేసిన ఈడీ
  • సోరెన్ పై మనీలాండరింగ్ ఆరోపణలు
  • ఇటీవల బెయిల్ పై విడుదలైన హేమంత్ 
  • ఝార్ఖండ్ సీఎం పదవికి రాజీనామా చేసిన చంపయీ సోరెన్
  • ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటూ హేమంత్ సోరెన్ ను ఆహ్వానించిన గవర్నర్

ఇటీవల బెయిల్ పై విడుదలైన హేమంత్ సోరెన్ నేడు ఝార్ఖండ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఐదు నెలల తర్వాత మళ్లీ ఝార్ఖండ్ ముఖ్యమంత్రి పీఠాన్ని సోరెన్ అధిష్ఠించారు. రాంచీలోని రాజ్ భవన్ లో హేమంత్ తో గవర్నర్ రాధాకృష్ణన్ ప్రమాణం చేయించారు. 

8.5 ఎకరాల భూమికి సంబంధించిన కేసులో మనీలాండరింగ్ ఆరోపణలపై అరెస్టయిన సోరెన్ 5 నెలల పాటు జైల్లో గడిపారు. ఆయనకు ఇటీవలే న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది. 

కాగా, హేమంత్ సోరెన్ జైల్లో ఉన్న సమయంలో చంపయీ సోరెన్ ఝార్ఖండ్ ముఖ్యమంత్రిగా వ్యవహరించారు. హేమంత్ జైలు నుంచి విడుదలైన నేపథ్యంలో, అధికార జేఎంఎం ఎమ్మెల్యేలు చంపయీ సోరెన్ నివాసంలో సమావేశమయ్యారు. హేమంత్ ను తమ శాసనసభాపక్ష నేతగా ఎన్నుకున్నారు. చంపయీ సోరెన్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయగా, హేమంత్ సోరెన్ ను ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటూ గవర్నర్ రాధాకృష్ణన్ ఆహ్వానించారు. 

వాస్తవానికి జులై 7న ప్రమాణ స్వీకారం చేయాలని హేమంత్ భావించారు. అనూహ్య రీతిలో ఈ మధ్యాహ్నమే ప్రమాణ స్వీకారం చేశారు.

  • Loading...

More Telugu News