Bhumireddy: పెద్దిరెడ్డి కుటుంబంపై విజిలెన్స్ డీజీకి ఫిర్యాదు చేసిన టీడీపీ ఎమ్మెల్సీ భూమిరెడ్డి

TDP MLC Bhumireddy complains against Peddireddy family


తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి మాజీ మంత్రి పెద్దిరెడ్డి కుటుంబంపై విజిలెన్స్ ఎన్ ఫోర్స్ మెంట్ డీజీకి ఫిర్యాదు చేశారు. మంగంపేట ముగ్గురాయి గనుల అక్రమాలపై విచారణ జరిపించాలని కోరారు. ముగ్గురాయి గనుల్లో రూ.2 వేల కోట్ల మేర దోపిడీ చేశారని తెలిపారు. ఏంప్రెడా కంపెనీ ముసుగులో పెద్దిరెడ్డి కుటుంబం భారీ దోపిడీకి పాల్పడిందని భూమిరెడ్డి ఆరోపించారు. మాజీ ఎండీ వెంకట్ రెడ్డి, సుదర్శన్ రెడ్డి అక్రమార్కులకు అండగా నిలిచారని వివరించారు.

Bhumireddy
Peddireddi Ramachandra Reddy
Vigilance
Mines
TDP
YSRCP
Andhra Pradesh
  • Loading...

More Telugu News