Radhakishan Rao: రాధాకిషన్ రావును అదుపులోకి తీసుకున్న పోలీసులు
- పీటీ వారెంట్‌పై అదుపులోకి తీసుకున్న పోలీసులు
- జుబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో నమోదైన కేసులో అరెస్ట్
- ఓ ల్యాండ్ వ్యవహారంలో వ్యాపారవేత్తను బెదిరించాడని కేసు
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక నిందితుడు రాధాకిషన్ రావును పోలీసులు అదుపులోకీ తీసుకున్నారు. చంచల్‌గూడ జైల్లో ఉన్న ఆయనను పీటీ వారెంట్‌పై అదుపులోకి తీసుకుని, నాంపల్లి కోర్టులో హాజరుపరిచారు. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో నమోదైన కేసుకు సంబంధించి రాధాకిషన్ రావును అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు.
ఓ ల్యాండ్ వ్యవహారంలో వ్యాపారవేత్తను బెదిరించినందుకు ఆయనపై జుబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. ఓ కంపెనీ వ్యవహారంలో రాధాకిషన్ రావు జోక్యం చేసుకొని సెటిల్మెంట్ చేశారని ఆరోపణలు ఉన్నాయి. రూ.150 కోట్ల విలువైన కంపెనీని తక్కువ ధరకు మరొకరికి ఇప్పించినట్లుగా ఫిర్యాదులో పేర్కొన్నారు.