Gudivada Amarnath: అది అయిపోగానే మా యాక్షన్ ప్లాన్ మొదలుపెడతాం..: మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్
![Former Minister Gudivada Amarnath Sensational Comments](https://imgd.ap7am.com/thumbnail/cr-20240704tn6686710668851.jpg)
- ఎన్నికల్లో గెలిచిన కూటమి నేతలు హనీమూన్‌లో ఉన్నారని వ్యాఖ్య
- వారి హనీమూన్ అయిపోగానే తమ యాక్షన్ ప్లాన్ మొదలుపెడతామన్న అమర్నాథ్
- ఓటమికి కారణాలను విశ్లేషించుకుంటున్నామని వెల్లడి
వైసీపీ నేత, మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ టీడీపీ కూటమి ప్రభుత్వంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. సార్వత్రిక ఎన్నికల్లో గెలిచిన కూటమి నేతలు ప్రస్తుతం హనీమూన్‌లో ఉన్నారని, వారి హనీమూన్ అయిపోగానే తమ యాక్షన్ ప్లాన్ మొదలుపెడతామన్నారు.
ఇక అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ ఊహించని విధంగా పరాజయం పాలైందన్న అమర్నాథ్.. దానికి గల కారణాలను విశ్లేషించుకుంటున్నామని తెలిపారు. ఎన్నో సంక్షేమ పథకాలతో తమ ప్రభుత్వం మంచి పాలన అందించిందన్నారు. అయినా ప్రజలు తిరస్కరించారని వాపోయారు.
వాలంటీర్ల వల్ల ప్రజలకు మేలు జరిగినప్పటికీ, పార్టీ మాత్రం నష్టపోయిందన్నారు. ఎన్నికల్లో ఓటమి చెందిన నేతలందరూ వాలంటీర్లపై ఇదే అభిప్రాయంతో ఉన్నారని చెప్పుకొచ్చారు.