K Keshav Rao: రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసిన కె.కేశవరావు

KK resigns as Rajya Sabha member

  • రాజ్యసభ చైర్మన్‌కు రాజీనామా లేఖను సమర్పించిన కేకే
  • నిన్న కాంగ్రెస్ పార్టీలో చేరిన కేశవరావు
  • కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన ఖర్గే

తెలంగాణ సీనియర్ రాజకీయ నాయకుడు కె.కేశవరావు తన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. రాజ్యసభ చైర్మన్ ధన్‌ఖడ్‌కు రాజీనామా లేఖను సమర్పించారు. కేశవరావు నిన్న కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆయనకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. సీఎం రేవంత్ రెడ్డి, తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ దీపాదాస్ మున్షీ, తదితరుల సమక్షంలో ఆయన కొన్నేళ్ల తర్వాత కాంగ్రెస్‌లోకి తిరిగి వచ్చారు. 2013లో కాంగ్రెస్ పార్టీని వీడిన ఆయన... తిరిగి సొంతగూటికి చేరుకున్నారు. ఈ నేపథ్యంలో ఆయన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు.

More Telugu News